సోనియా, రాహుల్ వారించ‌డంతో త‌ల‌వంచా : డీకే

నవతెలంగాణ – బెంగ‌ళూర్ : క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘ‌న‌విజయం అనంత‌రం సిద్ధ‌రామ‌య్య‌కు పార్టీ హైక‌మాండ్ సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం, డిప్యూటీ సీఎం ప‌ద‌వికి డీకే శివ‌కుమార్ అంగీక‌రించ‌డంపై ఎట్ట‌కేల‌కు సీనియ‌ర్ నేత‌ పెద‌వివిప్పారు. రామ‌న‌గ‌ర‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి డీకే శివ‌కుమార్ మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచ‌న మేర‌కు సీఎం కావాల‌నే త‌న ఆకాంక్ష‌ను విడిచిపెట్టాన‌ని చెప్పుకొచ్చారు. న‌న్ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు మీరంతా పెద్దసంఖ్య‌లో నాకు ఓట్లు వేశారు. కానీ హైక‌మాండ్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. అగ్ర నేత‌లు సోనియా, రాహుల్‌, ఖ‌ర్గేలు ఇచ్చిన సూచ‌న‌కు నేను త‌ల‌వంచాన‌ని డీకే పేర్కొన్నారు. తానిప్పుడు మ‌రింత స‌హ‌నంతో వేచిచూడాల్సి ఉంద‌ని, అయితే మీ ఆకాంక్ష‌లు మాత్రం వృధా కావ‌ని స్ప‌ష్టం చేశారు.

 

Spread the love