వర్షాలకు మన జుట్టు చిట్లిపోయి నిర్జీవంగా తయారవుతుంది. అయితే ప్రకతి మనకు పుష్కలమైన పోషకాహార పదార్థాలను అందించింది. ఈ పదార్ధాలతో మన కురులు పట్టులా మెరిసిపోతాయి. కొబ్బరి, అలోవెరా వంటివి జుట్టు సంరక్షణకు చక్కటి మార్గాలు. వాటిలో ఉండే తేమ మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. మారికో లిమిటెడ్ చీఫ్ ఆర్ అండ్ డి ఆఫీసర్ డా. శిల్పా వోరా మన జుట్టును మదువుగా ఉంచి ప్రకృతి పదార్థాల గురించి వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం…
అలోవెరా : ఔషధ, సౌందర్య ప్రయోజనాల కోసం కలబంద శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. చర్మానికి అది అందించే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అయితే జుట్టు ఆరోగ్యానికి ఇది చేసే అద్భుతాల గురించి కొందరికి తెలియదు. అలోవెరాను తలపై అప్లై చేస్తే తల చర్మం చుట్టూ ఒక రక్షిత పొరను ఏర్పరు స్తుంది. పర్యావరణ నష్టం నుండి తేమను కాపాడు తుంది. జుట్టు మొత్తానికి రాస్తే ప్రతి కొనను మదువుగా చేస్తుంది. దాంతో జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె : జుట్టు ఆరోగ్యానికి ప్రకృతి మనకు ప్రసాదించిన మరో విలువైన పదార్థం కొబ్బరి నూనె. దీని తో మాడుపై మర్దనా చేస్తే చక్కటి ప్రయో జనాలు చేకూరు తాయి. కొబ్బరి నూనె మాడు లోపలికి చొచ్చు కెళ్లి మూలాలకు లోపలి నుంచి పోషకాలను అందిస్తుంది.
ఇక కలబంద, కొబ్బరి నూనె కలిపినపుడు అది మరింత బలమైన సంరక్షణిగా మారుతుంది. ఇది జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గించడంలో శక్తివంతమైన సంరక్షణ పరిష్కారాన్ని అందిస్తుంది. దీన్ని సొంతంగా తయారు చేసుకోవడం కష్టమైతే అలోవెరాతో తయారు చేసిన కొబ్బరి నూనెను ఎంచుకోవచ్చు. పారాచూట్ అడ్వాన్స్‌డ్ అలోవెరా ఎన్‌రిచ్డ్ కోకోనట్ బేస్డ్ హెయిర్ ఆయిల్ అలోవెరాతో సమద్ధిగా ఉండే పోషకమైన హెయిర్ ఆయిల్. ఇది జుట్టు చిట్లటాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మదు వైన, పోషకమైన జుట్టును అందిస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ చాలా తేలికైనది, జిగటగా ఉండదు. వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు ఈ నూనె చక్కటి పరిష్కారం.
– డా. శిల్పా వోరా
చీఫ్ ఆర్ అండ్ డి ఆఫీసర్, మారికో లిమిటెడ్