Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంపుపై ప్రత్యేక దృష్టి

 జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంపుపై ప్రత్యేక దృష్టి

- Advertisement -

 ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
అవగాహన సదస్సులో ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ 
నవతెలంగాణ-అచ్చంపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా అచ్చంపేట డివిజన్ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్య లక్ష్మి ఫంక్షన్ హాల్ లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి చంద్రశేఖర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నాగర్ కర్నూలు జిల్లాలో 51 వేలు ఎకరాలలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఆయిల్ ఫామ్ తోటలు 8,200 ఎకరాలలో సాగు చేశారు. ఆయిల్ ఫామ్ తోటలు సాగులు మరింత పెంచేందుకు రైతులు ఆసక్తి చూపించాలన్నారు. ఉద్యానవన పంటలు సాగు  చేసేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులకు ప్రధాన మంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌకర్యాల గురించి వివరించారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు సి. మధుసూదన్ రెడ్డి, పోకల మనోహర్, నరసింహారావు, ఏ డి ఏ చంద్రశేఖర్, కే.వి.కే  పాలెం నుండి సిద్ధప్ప ఆగ్రోనామిస్ట్ , మండలాల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన క్షేత్ర అధికారి గోవర్ధన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -