– పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని దేమికలన్ గ్రామంలో మండల ప్రత్యేక అధికారి వసంత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీలను, శానిటేషన్ పనులను, పరిశీలించారు. గ్రామంలో మురికి కాలువలు, రోడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.చెత్తాచెదారాన్ని వెంట వెంటనే తొలగించాలని ఆదేశించారు. అలాగే నర్సరీలలోని మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా నీళ్ళు పోయాలని చెప్పారు.ఎండలు ఎక్కువగా ఉన్నందున మొక్కలకు సమయానికి నీళ్ళు అందించాలని తెలిపారు. ఆమె వెంట ఎంపిఓ ఇప్సిత రాణి, కార్యదర్శి రమేష్ రావ్, ఫీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు ఉన్నారు.