మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

– బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మాదర్ శ్రీకాంత్
– వాలీబాల్ క్రీడాకారులకు టీ షర్ట్లు, వాలిబాడు కిట్లు పంపిణీ
నవతెలంగాణ – తాడ్వాయి
క్రీడలు మానసికల్లోసానికి ఉపయోగపడతాయని ములుగు జిల్లా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మాదిరి శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలో నీ వాలీబాల్ క్రీడాకారులకు టీ షర్ట్లు, వాలీబాల్ లు, నెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంగాను, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయన్నారు. క్రీడలు జాతీయ భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love