ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య సత్తా

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య సత్తానవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీసీ అయినా, బైపీసీ అయినా టాప్‌ మార్కులు సాధించేది శ్రీచైతన్య విద్యార్థులేనని తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 468 మార్కులు, బైపీసీలో 438 మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 993 మార్కులు, బైపీసీలో 994 మార్కులు తమ విద్యార్థులు సాధించారని వివరించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో 470కిగాను 468 మార్కులను 26 మంది, 467 మార్కులు ఆపైన 422 మంది, 466 మార్కులు ఆపైన 1,100 మంది, 460 మార్కులు ఆపైన 3,822 మంది శ్రీచైతన్య విద్యార్థులు పొందారని పేర్కొన్నారు. బైపీసీలో 440కిగాను 438 మార్కులు 19 మంది, 437 మార్కులు ఆపైన 162 మంది, 436 మార్కులు ఆపైన 404 మంది, 435 మార్కులు ఆపైన 631 మంది, 430 మార్కులు ఆపైన 1,624 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వెయ్యికిగాను 993 మార్కులు ఐదుగురు, బైపీసీలో 994తోపాటు 990 మార్కులు ఆపైన 83 మంది, 985 మార్కులు ఆపైన 603 మంది, 980 మార్కులు ఆపైన 1,566 మంది, 900 మార్కులు ఆపైన 16,431 మంది విద్యార్థులు సాధించారని వివరించారు. జేఈఈ మెయిన్‌కు సంబంధించి ఏన్టీఏ విడుదల చేసిన కీలో 300కి 300 మార్కులు సాధించిన విద్యార్థులు నలుగున్నారని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌లలోనూ నెంబర్‌వన్‌ ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love