టెంప్టేషన్స్‌లో రోబోటిక్స్‌ వడ్డింపు

టెంప్టేషన్స్‌లో రోబోటిక్స్‌ వడ్డింపువిజయవాడ : నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌ టెంప్టెషన్స్‌లో వినూత్నంగా రోబోటిక్స్‌ సేవలను ప్రవేశపెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. భోజనప్రియుల డైనింగ్‌ అనుభవాన్ని మరింత మెరుపర్చనున్నట్లు పేర్కొంది. రుచిక రమైన వంటకాలు, చల్లని ఆతిథ్యం, ఆవిష్కరణ పట్ల తమ నిబద్ధతలో భాగంగా అత్యాధునిక రోబోటిక్స్‌ని పరిచయం చేస్తోన్నట్లు తెలిపింది. తమ ఈ రొబో ఫుడ్‌ సర్వీసుతో పాటు క్లీనింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటుందని నిర్వాహకులు వెల్లడించారు. తమ ఈ కొత్త రోబోటిక్‌ సేవలను పరిశీలనలో భాగంగా తొలుత ఏప్రిల్‌ 26 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. విందులను సమర్ధవంతంగా అందించడంలో సాంప్రదాయ పద్దతులకు రోబోటిక్‌ ప్రత్యామ్నాయం కాదని.. కానీ భోజన ప్రియులకు మరింత మెరుగైన సేవల పెంపుదలకు దోహదం ఇది చేయనుందని నిర్వాహకులు తెలిపారు.

Spread the love