మోడీ ఎన్నికల ప్రచారంపై స్టాలిన్ విసుర్లు..

నవతెలంగాణ – చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న  మోడీకి.. ఆయన ఇస్తున్న గ్యారెంటీలపై సవాల్‌ విసిరారు. ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ జాబితాను పోస్టు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌.. అధికారంలో ఉన్న బీజేపీ అందులో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించగలదా అని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రంలో చేస్తున్న పర్యటనను పక్షుల వలసతో పోల్చారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే దేశంలో నెలకొన్న పలు క్లిష్ట సమస్యలను మోదీ సర్కార్‌ పరిష్కరించగలదా అని సవాల్‌ విసిరారు. సీజన్‌లో పక్షులు వలస వచ్చినట్లుగా.. ఎన్నికల సమయంలో మోడీ తమిళనాడులో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. హామీ కార్డుతో వచ్చిన ఆయన ఈ హామీలను ఇవ్వగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల వ్యవహరం, చైనా ఆక్రమించిన భూభాగం, కులగణన వంటి అంశాలను జాబితాలో ప్రస్తావించారు. పౌరసత్వ చట్టానికి నోటిఫై చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలన్నారు.

Spread the love