దమ్ముంటే ఎదురుగా  నిలబడి గెలువు..

– బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-ధర్మసాగర్
దమ్ముంటే ఎదురుగా నిలబడి గెలవండని సవాలు వెలిసిన స్థానిక ప్రజా ప్రతినిధులు. శనివారం మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్లో ప్రియతమా మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 73వ జన్మదిన వేడుకల సందర్భంగా సర్పంచుల పోరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తాటికాయల సర్పంచ్ పెసలు రమేష్, స్థానిక సర్పంచి ఎర్రబెల్లి శరత్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు పార్టీ కార్యకర్తలు అట్టహాసంగా,ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దమ్ముంటే కడియం శ్రీహరి ఎదురుగా పోటీలో నిలబడి గెలవాలని, కొందరు నాయకులు కల్లబొల్లి మాటలతో,లేనిపోని మాటలతో కడియం శ్రీహరి గారి పైన చేస్తున్న అనుచిత వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని,లేని పక్షంలో తగిన శిక్ష అనుభవిస్తారని ఎద్దేవ చేశారు. ఇలాంటి అనుచిత మాటలకు మాట్లాడకుండా వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని ఆరోపించారు. కడియం శ్రీహరి గారి మద్దతు లేనిదే వారికి రెండు దఫాలుగా రాజకీయ భవిష్యత్తే లేనే, లేదని నాయకులు గుర్తు చేసుకున్నారు.ఈ విధంగా గోడ మీది పిల్లి లాగా ఇలాంటి వ్యాఖ్యలను చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. దమ్ముంటే ఆయన ముందు నిలబడి విమర్శించాలని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ముందు నీళ్లు, నిధులు నియామకాలు అనకముందే ఆయన ఈ నియోజకవర్గంలోని మండలాలను,రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  నాయకుడు పై రాజకీయంగా ఎదుర్కొనలేకనే అనుచిత వాక్యాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. అనంతరం వారి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి,బాణాసంచాలతో, కడియం శ్రీహరి గారి నాయకత్వం వర్ధిల్లాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులు,కార్యకర్తలు వారికి ప్రియతమా నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ టికెట్ తరుపున ఆయనకు పార్టీ టికెట్ ఇస్తున్నట్లు కొన్ని అవాస్తవ పత్రికల ప్రచురణలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒకవేళ ఆయనకు టిఆర్ఎస్ పార్టీ తరఫున స్టేషన్గన్పూర్ నియోజకవర్గ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నైనా తనను నిలబెట్టి  గెలిపించుకుంటామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మునిగాల యాకోబు, రాజారపు యాదగిరి, తోట నాగరాజు, ఎర్రబెల్లి వెంకట నరసమ్మ, కందుకూరి జయమ్మ జలంధర్, చాడ నరసింహారెడ్డి, అనురాధ ఠాగూర్, బొడ్డు ప్రదీప్ కుమార్, బొడ్డు అరుణ ఇమాన్, మాజీ  ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love