ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలి

– వికారాబాద్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ శర్మ
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
ఈ నెల 25వ తేదీ నుంచి ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీకి చర్యలు తీసుకుంటున్న ట్టు వికారాబాద్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ శర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో చేవెళ్ల పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యం లో వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో పని చేసే సెలెక్టరోల్‌ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఓటర్‌ స్లిప్‌ పంచడంతోపాటు ఓటర్‌ గైడ్‌ను కూడా అందించాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో బూత్‌ స్థాయి అధికారులు ఓటర్‌ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటర్‌కూ అందేలా బాధ్యతగా పని చేయాలని సూచించారు. వికారాబాద్‌ ని యోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 284 పోలింగ్‌ కేంద్రా లలో 1136 సిబ్బందితో విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా 26 మంది సెక్టోరల్‌ అధికారులను నియమించినట్టు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు గ్రామాల్లో, మున్సిపాలిటీలలోని పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధం కావాలని ఆయన తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పో లింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు సమకూర్చుకోవాలని సూచించారు. వ యోవృద్ధులు, వికలాంగ ఓటర్ల సదుపాయ నిమిత్తం వీల్‌ చైర్లను అందుబా టులో ఉంచాలని అధికారులకు సూచించారు. మున్సిపల్‌, పంచాయతీ అధి కారులు సమన్వ యంతో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించా లని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నిక సామాగ్రిని చేరవేసేందుకు వీలుగా వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి జోసెఫ్‌కు సూచించారు. ఈ సమావేశంలో వికారా బాద్‌, బంట్వారం తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌ ఉన్నారు.

Spread the love