అక్రమ అరెస్టులు ఆపాలి

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరసింహ
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమ అరెస్టులను ఆపాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నర సింహ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హైదరాబాదులోని సాహెబ్‌నగర్‌ సర్వేనెంబర్‌ 71/1 ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు ఇంటి స్థలాల కోసం కొంతకాలంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారని అన్నారు. కొందరూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ స్థలంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి వారిపైన కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈ స్థలంలో ఇల్లు కట్టిస్తామని మాయ మాటలు చెప్పిన బీఆర్‌ఎస్‌ నాయకులపై, పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love