కూల్చివేతలు ఆపండి

 Stop the demolitionsపంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు
ఛండీగడ్‌ : హర్యానాలోని నుహ్ జిల్లాలో కూల్చివేత కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు సోమవారం ఆదేశించింది. హైకోర్టు తీర్పును అనుసరించి బుల్డోజర్‌ చర్యను నిలిపివేయాలని డిప్యూటీ కమిషనర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత వారం విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక్‌ యాత్రను గురుగ్రామ్‌ అల్వార్‌ జాతీయ రహదారిపై కొందరు యువకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇద్దరు హౌంగార్డులతో సహా ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. నుహ్, గురుగ్రామ్‌, పల్వాలా, ఫరీదాబాద్‌లలో అధికారులు ఆంక్షలు విధించారు.నుహ్ కి 20 కిలోమీటర్ల దూరంలోని తావ్‌డూ పట్టణంలో అక్రమ వలసదారులు ఉంటు న్నారని, వీరే అల్లర్లకు కారణమంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. గత శుక్ర వారం నుంచి 350కి పైగా గుడిసెలు, 50కి పైగా దుకాణాలు, వ్యాపార సముదాయాలను కూల్చివేసింది. ఇవన్నీ అక్రమ కట్టడాలని అధికారులు ఆరోపించారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు కూల్చివేతలను నిలిపి వేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ముస్లింలు లక్ష్యంగా ఈ కూల్చివేత కార్య క్రమం చేపడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇండ్లను ధ్వంసం చేసిన వారిలో చాలా మంది తమకు ముందస్తు నోటీసు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Spread the love