ఆపదలో… ఆపన్న హస్తం

– సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్‌
– ఆర్థిక సాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్న పాండు రంగారెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
తిరుమలగిరి సాగర్‌ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వైష్ణవి కన్‌ స్ట్రక్షన్స్‌ చైర్మెన్‌ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి తన ఫౌండేషన్‌ ద్వారా అనాదలకు వికలాంగులకు, వృద్ధులకు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న బాధితులకు నేను అండగా ఉన్నానంటూ ముందుకు వచ్చి ఆపన్న -హస్తం అందిస్తున్నారు. పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి, తిరుమలగిరి సాగర్‌ వైస్‌ ఎంపీపి యడవల్లి దిలీప్‌రెడ్డి, యువ నాయకులు వాసికర్ల వినరురెడ్డి సహకారంతో శుక్రవారం మండలంలోని పెద్దవూర, సంగారం, బట్టుగూడెం, గ్రామాల్లో వికలాంగులకు, పేదలకు ఒక్కొక్కరికి 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పెద్దవూర పంచాయతీలో ఊరేమధు, సంగారం గ్రామానికి చెందిన ఈదమ్మ, ఈదులగూడెం గ్రామానికి చెందిన అమరోజు లింగయ్య, దంతోజు వెంకన్న ఒక్కొక్కరికి 10 వేల చొప్పున 40 వేలు, బట్టుగూడెం గ్రామంలో చెన్ను వాసురెడ్డి, దండెం సైదులు, రామచంద్రమ్మ ఒక్కరికి 10 వేలు, గాలివెంకటమ్మకు 15వేలు మొత్తం 85,000 ఆర్థిక సాయం బూసిరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ పేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలోసర్పంచులు నడ్డి లింగయ్య, చామకూరి చిన లింగారెడ్డి, సుంకిరెడ్డి ప్రభావతి సంజీవరెడ్డి, బాణావత్‌ శంకర్‌, జిల్లా నాయకులు రమావత్‌ రవినాయక్‌, ఎంపీటీసీ పులిమాల కృష్ణారావు, మిట్టపల్లి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మట్టపల్లి ప్రదీప్‌రెడ్డి, బుర్రి రాంరెడ్డి పాల్గొన్నారు.

Spread the love