సమాజ ప్రగతికి విద్యార్థులే చోదక శక్తి

– పీడీఎస్‌యూ రాష్ట్ర కౌన్సిల్‌లో అంబటి నాగయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజ ప్రగతికి విద్యార్థులే చోదక శక్తి అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఉర్దూగర్‌ ఫక్షన్‌ హాలు, కామ్రేడ్‌ జార్జి, జెసిఎస్‌ నగర్‌ నందు జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.సాంబ అధ్యక్షతవహించగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య ప్రారంభ ఉపన్యాసం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుంది అని నాటి మహనీయులు పేర్కొంటే నేటి మన పాలకులు మత గ్రంథాల్లోనే ఉందని చెబుతూ భారే వాట్సాప్‌ యూనివర్సిటీ నుంచి అనేక అసత్యాలను సృష్టిస్తూ విద్యార్థులను మతోన్మాదులుగా తయారు చేస్తున్నారని చదువుల్లో సారం లేకుండా చేస్తూ ప్రశ్నించే తత్వాన్ని, పోరాటపటమని నీరుగారుస్తున్నారు. పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ ఎం.రామకృష్ణ మాట్లాడుతూ పాలకులు విద్యను వ్యాపార సరుకుగా చూస్తున్నారని విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే దిశగా నేటి పాలకవర్గాలు ఉన్నాయి. దేశంలో దేశ ప్రగతి అశాస్త్రియ వైపు నడిపించేందుకు నేటి పాలకులు విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా కుప్పకూల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు.అందరికీ ఉచిత విద్య నాణ్యమైన విద్య అందించడం పాలకుల కనీస బాధ్యతగా ఉండాలని 1966 లోనే వచ్చిన ప్రొఫెసర్‌ కొఠారి కమిషన్‌ సిఫారసులను పాలకవర్గాలు పక్కన పెట్టాయని విమర్శించారు. గత 10 ఏండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, విశ్వవిద్యాలయాలకు వీసీ లను నియమించకుండా యూనివర్సిటీ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని ఆరోపించారు. ప్రాథమిక పాఠశాలలకు కనీసం మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులు లేరన్న సాకుతో 5000 ఒక పైగా పాఠశాలను మూసి చేశారని చెప్పారు. గాడిదప్పిన విద్యారంగాన్ని సరిచేయడానికి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యరంగాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, కానీ అవేం పట్టకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియూ రాష్ట్ర అధ్యక్షుడు అరెళ్ళి కృష్ణ, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌, పీడిఎస్‌యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్న అప్పారావు, రాష్ట్ర కోశాధికారి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సతీష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love