రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన చింతల్‌ భాగ్యరధి కళాశాల విద్యార్థులు

– కళాశాల ఆవరణలో అధ్యాపకులు,విద్యార్థుల సంబరాలు
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌/జగద్గిరిగుట్ట
వెలువడిన ఇంటర్‌ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో చింతల్‌లోని భాగ్యరధి జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరంలో బై.పి.సి. విభాగంలో అప్షాన్‌ జబీన్‌(438/440) మార్కు లతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. సి.ఈ.సి. విభాగంలో షాహిమా (492/500) మార్కులు, ఎం.పీ.సీ విభాగంలో ఎల్‌.రవీనా (466/470) మార్కులతోపాటు ఎం.ఈ.సి. విభాగంలో బి.నందిని (485/500) మార్కులతో తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎం.పీ.సీ.విభాగంలో బి. శబ్నం(979/1000) బై.పి.సి.విభాగంలో షేక్‌ రషీద్‌(972/1000), ఎం.ఈ.సి.విభాగం లో ఎన్‌.సౌమ్య (914/1000), సీ.ఈ.సీ.విభాగంలో సి.హెచ్‌.సాయి చందన(976/1000) అత్యధిక మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికే తలమా నికంగా నిలిచారని కళాశాల యాజమాన్యం విద్యార్థులు కళాశాల ఆవరణలో బుధవారం బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపు కున్నారు.ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను, తల్లిదండ్రులను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు తదుపరి సంవత్సరం ఎటువంటి ట్యూషన్‌ ఫీజు లేకుండా ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించినందుకు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత కొన్నేండ్లుగా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని పేర్కొన్నారు. డైరెక్టర్లు కె.రామకష్ణ,నల్లా జయశంకర్‌ గౌడ్‌,జీ.రమేష్‌ బాబు, సీహెచ్‌.గోవిందరెడ్డిలు మాట్లాడుతూ చింతల్‌ పరిసర ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధిస్తున్నామన్నారు.పేద,మధ్యతరగతి విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పించడంలో భాగ్యరధి కాలేజీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రతీ సంవ త్సరం రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్న భాగ్య రధి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడానికి విద్యార్థులకు తగిన సూచనలిచ్చిన అధ్యాపక బందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయపరంపర ప్రతీ సంవత్సరం కొనసాగించాలని అందుకు తమ డైరెక్టర్లు ఎప్పుడు విద్యార్థులకు, అధ్యాపకులకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు.

Spread the love