– బీటీఏ డైరీ ఆవిష్కరణలో స్పీకర్ ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో బీటీఏ డైరీని ఆయన ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు ప్రతిభను కనబర్చాలని సూచించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కోరారు. బీటీఏ అధ్యక్షులు కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా ఉన్న అడిక్విసీ జీవో నెంబర్ రెండును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్‌లోనే పై చదువులు చదవడానికి అడ్డంగా ఉన్న మెమోను సవరిస్తూ 342 జీవోను గతంలో మాదిరిగానే జారీ చేయాలని సూచించారు.
ఈ విషయంపై స్పీకర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సలహాదారులు నాగారం యాదయ్య, కావలి కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీశైలం, నాయకులు బి రాజ్‌కుమార్, కావలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.