ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

– జెన్కో ట్రైనింగ్‌ సెంటర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ బాబు
– నారాయణ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు
– పాల్వంచ నారాయణ పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు
– అలరించిన విద్యార్థుల అద్భుత నత్యాలు
నవతెలంగాణ-పాల్వంచ
ప్రతి ఒక్కరు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కన్న తల్లితండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని టీఎస్‌ జెన్కో ట్రైనింగ్‌ సెంటర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కే. శ్రీనివాస్‌బాబు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ పాఠశాలలో ఈ చాంప్స్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ పాఠశాల ప్రిన్సిపల్‌ పూరేటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఎస్‌ జెన్‌ కో, చీఫ్‌ ఇంజనీర్‌ కే .శ్రీనివాస్‌బాబు, ఈ చాంప్స్‌ ఖమ్మం కోఆర్డినేటర్‌ వినోద లక్ష్మి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సాంస్కతిక కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు తమ అద్భుతమైన నత్య ప్రదర్శనలతో అతిథులను విశేషంగా అలరించారు. నత్య ప్రదర్శనల అనంతరం ఈ చాంప్స్‌ నుంచి ఈ టెక్నోకు వెళ్తున్న 5 వ తరగతి విద్యార్థులకు స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు ధరించే ప్రత్యేక దుస్తులను ధరింపజేసి, మెడల్స్‌తో సత్కరించి, గ్రాడ్యుయేషన్‌ డిప్లొమాలను అతిథుల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి కే .శ్రీనివాసబాబు, చీఫ్‌ ఇంజనీర్‌, టీఎస్‌ జెన్‌ కో మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సమాజంలో విద్యార్థులు చరవాణితో కాలం గడుపుతూ విలువైన సమయాన్ని వధా చేసుకుంటున్నారని, ఆ సమయాన్ని చదువుకు కేటాయిస్తే ఉజ్వల భవిష్యత్తును సాకారం చేసుకోవచ్చని, ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతోపాటు తల్లితండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని, మంచి అలవాట్లు, చదువుతో ఏదైనా సాధించవచ్చని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూరేటి నరసింహారావు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులపై చరవాణి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, విద్యార్థులు ఎంత క్రమ శిక్షణతో ఉంటే వారి భవిష్యత్తు అంత ఉన్నతంగా ఉంటుందన్నారు. అద్భుత ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులను అభినందిస్తూ, తమ ఉపాధ్యాయ బందం నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ, సజనాత్మకతను వెలికితీసేవిధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చాంప్స్‌ ఖమ్మం కోఆర్డినేటర్‌ వినోద లక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని, తమ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనేలా ప్రతి పండుగను నిర్వహించామన్నారు. ఈ చాంప్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ రుచిత శ్రీ 2023-24 విద్యా నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు, ప్రత్యేక పాటలకు వారు చేసిన అద్భుత నత్యాలు అందరినీ అమితంగా ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పూరేటి నరసింహారావు, ఇచాంప్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ రుచిత శ్రీ, ఈ టెక్నో అకడమిక్‌ డీన్‌ రామకష్ణ, ఇ కిడ్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మ, ఏఓ శ్రీనివాస్‌, కళ్యాణి, నాగూర్‌ బీ, ఉషారాణి, స్వప్న, శ్రీలత, జాహ్నవి, కిరణ్మయి, శ్రావణి, అనూష, మల్లేష్‌, సుజిత్‌, శ్వేత, ధనలక్ష్మి, అనూష, సరిత, రేణుక ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love