స్వయంభు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని సిద్దేశ్వర ఆలయం, మరకత లింగేశ్వర ఆలయాలను సందర్శించి, అనంతరం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శింంచుకని  పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  శివుని దయవలన ప్రజలందరూ ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70 శివాలయాలు ఉన్నాయనీ, వాటి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే కాలంలో మంచి వర్షాలు, రైతులు సుఖసంతోషాలతో పాడిపంటలతో , అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కష్ట సుఖాల్లొ ఇబ్బందులు లేకుండా ఇక్కడి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వాలని పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడం లింగమూర్తి, బంక చందు, చిత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love