Monday, June 15, 2026
E-PAPER
Homeఖమ్మంనందిపాడులో టీఏజీఎస్ మండల మహాసభ

నందిపాడులో టీఏజీఎస్ మండల మహాసభ

- Advertisement -

– ఐక్యపోరాటాలతోనే గిరిజన హక్కుల కు రక్షణ
– జిల్లా అధ్యక్షుడు గౌరి నాగేశ్వరరావు
– మండల అధ్యక్షుడు గా నాగేశ్వరరావు, కార్యదర్శిగా ప్రసాదరావు ఎన్నిక
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని నందిపాడులో సోమవారం టీఏజీఎస్ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) నాలుగో మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. వూకే వీరస్వామి ప్రాంగణంలో స్థానిక వార్డు సభ్యులు మాడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల రాజ్యాంగ హక్కులు, భూమి హక్కులు, అటవీ హక్కుల పరిరక్షణకు ఐక్యపోరాటాలే మార్గమని అన్నారు. గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మహాసభలో రైతు సంఘం నాయకురాలు మడకం శాంతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు బి. చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా నాయకుడు మడిపల్లి వెంకటేశ్వరరావు, నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ, ఉప సర్పంచ్ తుట్టి వీరభద్రం, కారం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా విశ్రాంత ఉపాధ్యాయుడు కారం వీరస్వామి, అధ్యక్షుడిగా మాడి నాగేశ్వరరావు, కార్యదర్శిగా సోడెం ప్రసాదరావు ఎన్నికయ్యారు. అలాగే మరో 15 మంది సభ్యులతో మండల కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన నాయకులను సభలో పాల్గొన్న ప్రతినిధులు అభినందించి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -