పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలి : తహశీల్దార్‌

నవతెలంగాణ-రాయపర్తి
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు లపై అవగాహన పెంచుకోవాలని తహశీల్దార్‌ కుసుమ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ.. పౌరులు తమ హ క్కులను ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై వివరించారు. ప్రాథమిక హక్కులు, విధులు తదితరఅంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హ క్కులతోపాటు, విధులను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ కోదాటి దయాకర్‌రావు, ఏఓ వీరభద్రం, ఆర్‌ఐ చంద్రమోహన్‌, ఉప సర్పంచ్‌ యాకయ్య, మాజీ సర్పంచ్‌ యాకయ్య, వార్డు మెంబర్‌ పెంటమ్మా, గాదె ముత్తయ్య, మెడ వెంకన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వేలేరు : విద్యద్వారానే పౌరహక్కులు కాపాడుకోగలం .సమాజంలో ప్రతి ఒక్కరు స్వేచ్చ,సమానత్వం, సోదరభావంతో భాద్యతగా మెలగాలి. రాజ్యాంగ బ ద్దంగా దేశంలోని పౌరులకు రాజ్యాంగ నిర్మాత డా బిఆర్‌ అంబేద్కర్‌ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవలెనన్న రాజ్యాంగం పై అవగాహన అవసర మని, విద్యద్వారానే అది సాద్యమని ప్రతిఒక్కరు రాజ్యాంగంపై జరిగే అవగాహన కార్యక్రమాలకు హాజరై లేదా రాజ్యాంగం చదువుకొని అవగాహన కల్పించుకుని పౌరహక్కులు సాదించుకునేలా సమాజంలోని ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉం డాలని వేలేరు తహశీల్ధార్‌ దేవులపల్లి సమ్మయ్య మంగళవారం మండలంలో జరిగి న పౌరహక్కుల దినోత్సవంలో అన్నారు. మండలంలోని బండతండా, చింతల తండా, గొల్లకిష్టంపల్లి తదితర గ్రామాల్లో జరిగిన పౌరహక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక స్వపరిపాలనలో బాగమే తండాలు గ్రామపంచాయితీలుగా ఏర్పడటం, గ్రామపంచాయితీల అభివద్దికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రణాళిక సంఘం నుండి నిధులు వస్తాయని అట్టి నిధులు పౌరహక్కుల సాధనకు ఉపయోగపడతాయని అన్నారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా ప్రతిఒక్కరు చొరవ చూపాలన్నారు.
చదువుద్వారానే ఇవన్ని సాద్యమని. పౌరహక్కుల అవగాహన కార్యక్రమాలలో ప్రతిఒక్కరు బాగస్వామ్యం అయినప్పుడే పౌరహక్కుల సాధన సాధ్యమవుతుంద న్నారు. అనంతరం ప్రజలచే పౌరహక్కుల దినోత్సవ ప్రత్ఞి చేయించారు. కార్యక్ర మంలో ఆయా గ్రామాల సర్పంచులు సర్పంచులు మాలోతు సంపత్‌ , రాంచం దర్‌, సందెల పరమేశ్వరి, ఆర్‌ఐ సమ్మయ్య, మండల గ్రామాల అధికారులు, ప్రజా ప్రతినిధులు,ప్రజలు పాల్గొన్నారు.

Spread the love