ఉపాధ్యాయులు భావి సమాజ నిర్దేశకులు: హెచ్ఎం బిక్షపతి

 
నవతెలంగాణ -పెద్దవంగర:ఉపాధ్యాయులు భావి సమాజ నిర్దేశకులని జెడ్పీ ఉన్నత పాఠశాల అవుతాపురం ప్రధానోపాధ్యాయుడు అల్లందాసు బిక్షపతి అన్నారు. మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా పూజించుకునే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు అందుకు గర్వపడాలని సూచించారు. విద్యార్థులు చక్కని విలువలతో కూడిన విద్యను ఆర్జించి భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఉపాధ్యాయుల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ వారి జీవితంలో నిజమైన వెలుగులు నింపి నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న మహానుభావులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్షీరసాగర్ రవికుమార్, రమేష్ కుమార్, రామ్మోహన్, రవి, శ్రీను, రత్నం, సంతోష్ కుమార్, శ్రీనివాస్, సునీత రాణి, సునిత, గోవర్ధన్, సురేష్, రామతార తదితరులు పాల్గొన్నారు
Spread the love