హెల్త్‌ హబ్‌గా తెలంగాణ

న‌వ‌తెలంగాణ హైద‌రాబాద్‌: హెల్త్‌ హబ్‌గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, అదే విధంగా ఆరోగ్యరంగంలో అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు.10వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని, కార్పొరేట్‌ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలు పోటీపడుతున్నాయన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు.

Spread the love