బీఆర్‌ఎస్ ఆఫీసులు,
వాహనాలపై దాడులు తగదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”అభివద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పరేడ్‌గ్రౌండ్ సభలో రాజకీయ విమర్శలు, మత విద్వేషాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమస్యలను ప్రస్తావించాలి’ అని ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ‘బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీని పక్క నబెట్టారు. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరిం చాల్సింది పోయి ఆస్తులను వేలం వేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టుకు నిధులు నిరాకరించడం, ఐటీఐఆర్ రద్దు చేయడం వల్ల తెలంగాణ యువత లక్షలాది ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. విద్యుత్ సవరణ బిల్లుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడుతున్నారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా, కేంద్రం కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల మీ వ్యతిరేకతకు నిదర్శనం. వారికి 42శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి. వీబీజీఆర్‌ఏఎం జీ పేరుతో కొత్త చట్టం తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. కేంద్రం తన వాటాను 90శాతం నుంచి 60శాతానికి తగ్గించి, 60లక్షల మంది కూలీల బతుకుదెరువును దెబ్బతీస్తోంది. సర్ పేరుతో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్నారు. వలస కూలీలు, పేదలు, మైనారిటీల ఓట్లను గల్లంతు చేయడం రాజ్యాంగ విరుద్ధం. సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు ఆపాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారు. విభజన చట్టం ప్రకారం హార్టికల్చర్
బీజేపీ దాడులు అప్రజాస్వామికం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



