పార్కులో ఆట వస్తువులు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కును మంగళవారం ఆయన సందర్శించారు. పార్కులో చెడిపోయిన ఆట వస్తువులను పరిశీలించారు. వాటి స్థానంలో కొత్తగా ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. నడక దారిలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పార్కులో క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. పార్కును అహ్లాదకర వాతావరణంగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.