Sunday, July 19, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీమూగబోయిన ఆమనీ కోయిల

మూగబోయిన ఆమనీ కోయిల

- Advertisement -

‘జానకి గొంతులో.. సన్నాయి మోగుతుంది. సామవేదం పలుకుతుంది జానకి గొంతులో.. పండు ముసలి వణుకుతుంది పసిపాప పలవరిస్తుంది’ కోయిలకే స్వరాలు నేర్పించి… మాటలతో మధురిమలు సృష్టించి.. శతిలయలే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవించి.. నీలి మేఘాలలో గాలి కెరటాలలో అంటూ.. ఆమె పాడిన పాటలు మన మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం సృష్టించి ‘దక్షిణాది కోకిల’ (Nightingale of South India)) గా సుస్థిర స్థానం సంపాదించుకున్న లెజెండరీ గాయని ఎస్‌. జానకి. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె మధుర గాత్ర ప్రయాణంలో వేలాది గీతాలు శ్రోతలను అలరించాయి. 50 వేలకు పైగా పాటలు పాడిన జానకి జులై 11న మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస వదలడంతో సంగీత ప్రపంచం మూగబోయింది.

లతా మంగేష్కర్‌ స్ఫూర్తితో…
జానకి ఏప్రిల్‌ 23, 1938న బ్రిటీష్‌ ఇండియాలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలోని గుంటూరు జిల్లా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌), రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామమూర్తి హొఉపాధ్యాయుడు,హొఆయుర్వేదహొవైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన హొకరీంనగర్‌ జిల్లాలోని హొసిరిసిల్లలో హొఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. 10వ ఏట రాజమండ్రిలో నాదస్వరంహొవిద్వాన్‌ పైడిస్వామి వద్ద ఏడాదిపాటు శిష్యరికం చేసింది. బాల్యం నుండి సినీ సంగీతంపై ఆకర్షితురాలయిన ఆమె లతా మంగేష్కర్‌,హొపి.సుశీల,హొజిక్కి,హొపి.లీలహొపాడిన పాటలు వివిధ కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది. జానకి ఒక ఇంటర్వ్యూలోహొలతా మంగేష్కర్‌ గొంతు (కంఠం) తనకి గురువని చెప్పడం విశేషం.

సినీ గాయనిగా…
తన 16వ ఏట ఆకాశవాణిలో జరిగిన పాటల పోటీల్లో జాతీయస్థాయిలో బహుమతి పొందిన జానకి, తన మామయ్య డా. చంద్రశేఖరం సలహా మేరకు,హొచెన్నైలోని హొఏ.వీ.యం. స్టూడియో అడిషన్‌కు హాజరై, ఆస్థాన గాయనిగా నియమితురాలయ్యింది. అనంతరం జానకి డా.చంద్రశేఖరం కుమారుడు వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి హొచెన్నైలో హొస్థిరపడ్డారు. 1957లో 17వ ఏట తన కెరీర్‌ను ప్రారంభించిన జానకిహొతెలుగు,హొతమిళం,హొమలయాళం,హొకన్నడ, హింది, ఒరియా మొదలైన అనేక భారతీయ భాషలలో 2016 వరకు 50 వేలకు పైగా పాటలు పాడారు. 58 ఏండ్ల పాటు ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో… నీవు పాడే పాట వినుపించునీ వేళ’ అంటూ, ‘పగలే వెన్నెలా జగమే ఊయలా’ లూగించి, ‘జిలిబిలి పలుకులహొచిలిపిగ పలికినహొఓ మైనా..మైనా’, ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాక కోసం’, ‘మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి’తో, ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ.. రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసూ’ లాంటి పాటలు పాడి శ్రోతలను అలరించిన జానకి సెప్టెంబరు 2016న పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

జానకికే సాధ్యం
తన సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం… ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకికే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. జానకి పాడిన పాటలలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌… కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.

వివిధ భాషల్లో…
జానకి దక్షిణాది భాషలలోనే కాకుండా హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కతం,హొతుళు, సౌరాష్ట్ర,హొజపనీస్‌,హొజర్మన్‌హొభాషలలో కూడా పాటలు పాడి శ్రోతలను మెప్పించారు. ఘంటసాల, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, పి.బి.శ్రీనివాస్‌,హొఇళయరాజా,హొఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం,హొకె.జె. జేసుదాస్‌, పి. జయ చంద్రన్‌,హొఎల్‌.ఆర్‌. ఈశ్వరి, వాణి జయరాం,హొ పి.లీలా, పి. సుశీల, కె.ఎస్‌. చిత్ర, సుజాత, జెన్సీహొవంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. జానకి సంగీత దర్శకురాలు హొకూడా. ఉషా కిరణ్‌ మూవీస్‌హొవారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి,హొభానుమతి,హొలీలహొతర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలయ్యింది.కృష్ణుని,హొసాయిబాబా హొభక్తురాలైన ఎస్‌. జానకి చాలా సమయం పూజలలో గడుపుతారు. అంతేకాకహొమీరా బాయి పై అనేక భక్తిగీతాల క్యాసెట్లు రికార్డు చేసి విడుదల చేశారు. వీటితో పాటు త్యాగరాజ కీర్తనలు, గజల్స్‌ పంచమ స్వరంలో పాడి అలరించారు. ఉర్దులో రాసిన గజల్‌ జానకి పాడగా, అది విన్న దర్శకులు కె. బాలచందర్‌ తన ‘ఆకలి రాజ్యం’ చిత్రంలో ‘తూహై రాజా మైహూ రాణీ’ అనే హిందీ గీతాన్ని పెట్టి జానకి చేత పాడించారు. ఈ పాటలో పంచమంలో ఒక్కింతసేపు స్వరాన్ని నిలిపివుంచే పీటు జానకి అద్బుతంగా చేశారు.

ఏ పాత్రకైనా పాడగల దిట్ట
పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి ఒక ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ ‘జానకి గాత్రధారణతో నా సాహిత్యానికి ఎంతో వన్నె, వాసి వచ్చింది. గాత్రదారణ ద్వారా.. పాత్ర ధారణని సుగమం చేసిన అనేక నాద నటనలు నేర్చిన గొప్ప స్వరం జానకిది…, ఆవిడ పదహారేళ్ళ వయసు చిత్రంలో పాడిన ‘సిరిమల్లె పువ్వా…హొసిరిమల్లె పువ్వా.. చిన్నారి చిలకమ్మా..హొనా వాడు ఎవరే’ గొప్ప ప్రశంశలు పొందడం సంతోషాదయకమని అన్నారు. తమిళంలో పాడిన ఈ పాట జానకికి జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ‘ఆమని వస్తే చాలు కోయిల గొంతులో ఎన్నో తియ్యదనాలు జాలువారుతాయి. ఆమని వచ్చినా, రాకపోయినా ఆమె కంఠంలో మధుర స్వరాలు ఎన్నో పలుకుతాయి’ అని ప్రముఖ దర్శక, నిర్మాత కె. విశ్వనాథ్‌ అన్నట్లు ఐదారేండ్ల పాప నుంచి ఆరవైయేండ్ల ముసలి పాత్రకయినా అనువుగా గొంతుమార్చి పాడగల దిట్ట జానకి అనడంలో అతిశయోశక్తి లేదు.

ఆమె గాత్ర మాధుర్యం
‘పదహారేళ్ళ వయసు’హొచిత్రంలోని ‘కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే..’ పాటలో పండు ముసలావిడ గొంతు…, ‘సప్తపది’ చిత్రంలో ‘గోవుల్లు తెల్లన… గోపయ్య నల్లన’ పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం, ‘స్వాతిముత్యం’లో ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ పాటలో పిల్లాడి గొంతు…, ‘శ్రీవారి శోభనం’ చిత్రంలోని ‘అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక’ పాటలో హీరోయిన్‌తో పాటు ఆమె బామ్మ గొంతుతో కూడా పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేక స్వరమని నిరూపించుకున్నారు జానకి. ఆమె గొంతులో ఎన్నెన్నో భావాలు.. ‘మంచుపల్లకి’ చిత్రంలో ‘మేఘమా దేహమా…’ పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత., ‘నిరీక్షణ’ చిత్రంలోని ‘ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది’ అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం., ‘సితార’ చిత్రంలోని ‘వెన్నెల్లో గోదావరి అందం…’ పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన., ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’ అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. ‘నీ లీల పాడెద దేవా…’ అనే పాట అరుణాచలం నాదస్వరానికి అనుగుణంగా పై శ్రుతిలో పాడి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అందుకే కాబోలు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, జానకి గురించి ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతి రోజు కొన్ని లీటర్ల తేనె తాగుతుంటది కావచ్చు. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్లా వస్తుంది’ అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు.

అద్భుత గాత్రానికి పురస్కారాలు
భారతీయ గాయనీలలో ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందిన జానకి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం నాలుగు సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే నంది అవార్డులను పది సార్లు, తమిళనాడు సినీ అవార్డులు ఏడు సార్లు, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా పదకొండు అవార్డులు సాధించారు. 1981లో సితార ఉత్తమ గాయని అవార్డు, 1986లో తమిళనాడు హొప్రభుత్వం కలైమామణి పురస్కారం, 1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు, 2002లో ఎచీవర్‌ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం, 2009లో మైసూరు విశ్వవిద్యాలయంహొనుండి గౌరవ డాక్టరేట్‌, 2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు, 2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డులు అందుకున్నారు.

పద్మ భూషణ్‌ను తిరస్కరించారు
2013లో దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని భారత ప్రభుత్వం తనకు ప్రకటించినహొపద్మ భూషణ్‌హొపురస్కారాన్ని తిరస్కరించారు. ఇలాంటి సరస్వతి మూర్తులు యుగానికి కొందరే పుడతారు. అందులో జానకి ఒకరు. జానకి చాలా నిరాడంబరజీవి, నీటైన వస్త్రాలు ధరించి నిర్మల దరహాసంతో అందరినీ పలకరిస్తారు. జానకికి నగలపై వ్యామోహం కాదుకదా, కనీసం ఆశ అయిన లేకపోవడం గొప్ప విషయం. నిష్కపటంగా ఉన్నది ఉన్నట్లు మనసులోని మాటలను మరుగుపర్చకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం, నిర్వికారంగా, నిర్విరామంగా తన పనేదో తాను చూసుకోవడం ఆమెకి అలవాటు. ఇవే ఆమెకి పెట్టని ఆభరణాలు. తన గొంతుతో సప్త స్వరాలు వినిపించి సంగీత ప్రియుల మనసులను రంజింపచేసి, తన గాత్రంతో శ్రోతలకు వీనులవిందైన పాటలు అందించిన జానకి గాన ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.

సంచలన కాంబినేషన్‌
భారతీయ సినీ సంగీత చరిత్రలో ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఇళయరాజా – ఎస్‌. జానకి’ కాంబినేషన్‌ ఒక సంచలనం. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన పాటలు దక్షిణాది ఇండిస్టీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్‌గా మారాయి. బాలుతో కలిసి జానకి పాడిన వేలాది యుగళ గీతాలు ప్రేమికులకు అమతకావ్యాలుగా నిలిచాయి.
ఇళయరాజా స్వరకల్పనలో ఆమె పాడిన మెలోడీలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె అద్భుత గాత్రానికి పురస్కారాలు దాసోహమన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌ కేవలం ఒక మ్యూజికల్‌ హిట్‌ కాదు.. సౌత్‌ ఇండియన్‌ సినిమా హిస్టరీని శాసించిన ఒక ‘ఎమోషనల్‌ అడిక్షన్‌’. ఇళయరాజా హార్మోనియం పెట్టెపై వేళ్లు కదిపితే.. జానకమ్మ తన గాత్రంతో ఆ ట్యూన్‌కు ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు. ‘సిరిమల్లె పువ్వా’ అంటూ ఆమె పలికిన అమాయకత్వం, ‘జననీ జననీ’ అంటూ సాగిన మైండ్‌ బ్లోయింగ్‌ భక్తి ప్రయాణం.. శ్రోతల గుండెల్లో ఒక ‘హీలింగ్‌ థెరపీ’లా నిలిచిపోయాయి.
(ప్రముఖ గాయని జానకి స్మతిలో…)

పద్మ భూషణ్‌ను తిరస్కరించారు 2013లో దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదని భారత ప్రభుత్వం తనకు ప్రకటించినహొపద్మ భూషణ్‌హొపురస్కారాన్ని తిరస్కరించారు. జానకి చాలా నిరాడంబరజీవి, నీటైన వస్త్రాలు ధరించి నిర్మల దరహాసంతో అందరినీ పలకరిస్తారు. జానకికి నగలపై వ్యామోహం కాదుకదా, కనీసం ఆశ అయిన లేకపోవడం గొప్ప విషయం.

కొడుకు మరణంతో…
జానకి దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు మురళీకృష్ణ. కొన్ని సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు. కాకపోతే సినీ రంగంలో కాకుండా తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు భార్య ఉమా, ఇద్దరు కూతుళ్లు వర్ష, అప్సర ఉన్నారు. ఇదిలా ఉంటే మురళీ కష్ణ ఆరు నెలల కిందటే గుండెపోటుతో కన్నుమూశారు. ఇది జానకిని బాగా కుంగదీసింది. 1997లో తన భర్తని కోల్పోయినప్పుడే ఆమె బాగా డౌన్‌ అయ్యారు. ఇప్పుడు చివరి దశలో కొడుకుని పోగొట్టుకోవడంతో జానకి కోలుకోలేకపోయింది. ఓ వైపు వయో భారం, మరోవైపు కొడుకు మరణంతో ఆమె బాగా కుంగిపోయారు. చాలా బెంగ పెట్టుకున్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. హఠాన్మరణం చెందారు. జులై 11న మైసూర్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.

డా. పొన్నం రవిచంద్ర,
సీనియర్‌ జర్నలిస్ట్‌, ఫిల్మ్‌ క్రిటిక్‌
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -