పార్లమెంటు వెబ్ సైట్లో కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వివరాలు పొందుపరచాలి

– రావి నారాయణరెడ్డి సేవా సంస్థ
నవతెలంగాణ – భువనగిరి రూరల్
భారత పార్లమెంట్ వెబ్ సైట్లో కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వివరాలు పొందుపరచాలని కోరుతూ శనివారం రావి నారాయణరెడ్డి సేవా సంస్థ నిర్వాహకులు ప్రధానమంత్రి కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర్య భారత దేశ మొట్ట మొదటి పార్లమెంటును 1952 సం.లో ప్రారంబించింది కీ.శే. రావి నారాయణ రెడ్డి అని, 1952 సం.లో జరిగిన మొట్ట మొదటి లోక్ సభ సార్వత్రిక ఎన్నికలలో, నల్లగొండ లోక్ సభ నియోజక వర్గం నుండి, దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్ లాంటి ఉద్ధండుల కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించిన వ్యక్తిగా రావి నారాయణ రెడ్డి కి ఆ గౌరవం దక్కిందనీ భారత పార్లమెంటు వెబ్ సైట్లో ( https://sansad.in/poi/about ) ఈ వివరాలు పొందు పరచలేదు. మొట్ట మొదటి భారత పార్లమెంటు ఉనికి లోకి వచ్చిన తేది. 17-04-1952 గా, మొట్ట మొదటి లోక్ సభ జరిగిన తేది.13-05-1952 గా, మొట్ట మొదటి లోక్ సభ స్పీకర్ జి ఎం  మావలాంకర్ లాంటి వివరాలు పొందు పరచినారు. మొట్ట మొదటగా లోక్ సభ ప్రారంభించిన వారి వివరాలు పేర్కొనలేదు.మొట్ట మొదటి లోక్ సభ ప్రారంభకులు రావి నారాయణ రెడ్డి  వివరాలు కూడా లోక్ సభ వెబ్ సైట్లో పొందు పరచాలని కోరుతూ, రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ (రి.నం.669/2023) , భారత ప్రధాని  నరేంద్ర మోడి ని కోరుతూ ఈ రోజు లేఖ రాశారు . ఈ లేఖను రిజిస్టర్ స్పీడ్ పోస్టు ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి, వెబ్ సైటు వివరాల కాపీ జతచేస్తూ పోస్టు చేయడం జరిగిందనీ సభ్యులు తెలిపారు. తెలంగాణ బిడ్డ, విలాస వంతమైన భూ స్వామ్య కుటుంబ జీవితాన్ని తృణ ప్రాయంగా వదిలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వాడు,  మొట్ట మొదటి భారత సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటి పొందిన వ్యక్తి, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను పణంగా పెట్టి సాయుధ పోరాటం చేసిన వాడు, తన వారసత్వ స్వంత ఐదొందల ఎకరాల భూమిని నిరు పేదలకు దానం చేసిన మహా మనిషి, వెట్టి చాకిరి నిర్మూలన పాటించి పోరాడిన వ్యక్తి, హరిజన సేవా సంఘ్ సెక్రటరీగా వంద స్కూల్లని ప్రారంభించిన మహా వ్యక్తి పద్మ విభూషన్ , బొల్లేపల్లి గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కీ.శే. రావి నారాయణ రెడ్డి అని అన్నారు. ఈ వివరాలు పేర్కొన లేక పోవడం వలన, రాబోవు తరాలు మరియు భవిష్యత్ యంపీలకు రావి నారాయణ రెడ్డి గురించి తెలియక పోవడం, రా బోవు తరాలు ఆయనను మరిచి పోయే ప్రమాదం వుందనారు.
Spread the love