నవతెలంగాణ – ఓదెల
బాయమ్మపల్లి గ్రామంలో గురువారం రోజున కురుమ సంఘం సభ్యులు అందరూ కలిసి బీరన్న కురుమ సంఘం కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దయ్యాల మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా దయ్యాల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి దయ్యాల శ్రీనివాస్, కోశాధికారి దయ్యాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా దయ్యాల నాగరాజు, బుడిమె సమ్మయ్య, దయ్యాల ఐలయ్య, దయ్యాల సమ్మయ్య, అమ్మ నాగరాజు, వట్టె కుమారస్వామి, దయ్యాల సంపత్, దయ్యాల రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.