అంబరాన్నింటిన ఊరుర చెరువుల పండుగ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు అన్ని గ్రామాల్లో ఊరుర చెరువుల పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి.చెరువుల సంబరాలతో పాటు మృగశిర కార్తె (మిర్గు) తోడవడంతో ప్రజలు చెపలను కోనుగోలు చేసుకుని పండుగ లో పాల్గొన్నారు.పలు గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచులు ముందు కు వచ్చి మెకలను,గోర్లను కోనుగోలు చేసుకుని బోనాలు,డప్పు వాయిద్యాలతో చెరువుల వద్దకు వెళ్ళి పండుగను చేసుకున్నారు.ఈ కార్యక్రమాలల్లో నిజామాబాద్ అర్డిఓ రవి, తహసిల్దార్ లు శ్రీనివాస్ రావు,టి వి రోజా, ఎంపిడిఓ లు గోపి బాబు, రాములు నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,ఉప సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము, సర్పంచ్ నర్సయ్య, కార్యదర్శి శ్రీధర్,కరోబర్ నరెందర్, షేక్ అసిఫోద్దిన్ తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love