Monday, April 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో తొలి విడత జనగణన ప్రారంభం

రాష్ట్రంలో తొలి విడత జనగణన ప్రారంభం

- Advertisement -

వివరాలు నమోదు చేసుకున్న గవర్నర్‌, సీఎం
మార్చి 10 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌కు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో జనగణన-2027 తొలివిడత ప్రారంభమైంది. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ కే.రామకృష్ణరావు తదితరులు ఆదివారం సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ (స్వీయ గణన) చేసుకున్నారు. అధికారుల సమక్షంలో గవర్నర్‌ జనగణన నమోదు చేసుకున్నారు. తెలంగాణ జనగణన డైరెక్టర్‌ భారతి హొళికెరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ సమక్షంలో సీఎం ‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’ ప్రక్రియ పూర్తి చేశారు. అధికార వెబ్‌సైట్‌లో ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంత్రుల నివాస సముదాయంలో, సీఎస్‌ రామకృష్ణారావు సచివాలయంలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. తొలి విడత జనగణనలో భాగంగా మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 10 వరకు డిజిటల్‌ విధానంలో స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలకు అవకావం కల్పించారు.
కుటుంబ వివరాలు నమోదు చేసుకోండి
రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌, సీఎం పిలుపు

పౌరులంతా తమ కుటుంబ వివరాలను సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ విధానంలో నమోదు చేసుకోవాలని గవర్నర్‌, సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖచ్చితమైన, సమగ్రమైన జనాభా లెక్కల కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం అత్యంత కీలకమనీ, ఏ ఒక్క ఇల్లూ లెక్కల్లోంచి తప్పిపోకూడదని వారు స్పష్టం చేశారు. 2027 సెన్సస్‌ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, దేశ ప్రగతికి తోడ్పడే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
2027 జనగణన కీ పాయింట్స్‌
మొదటి విడత:
2026 ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు అవకాశం (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ )
మే 11 నుంచి 2026 జూన్‌ 9 వరకు (ఇండ్ల గణన)
రెండో విడత:
ఫిబ్రవరి 9 నుంచి, 2027 ఫిబ్రవరి 28 వరకు( జనాభా సేకరణ)
2027 ఫిబ్రవరి 28న (ఇండ్లు లేని వారి వివరాలు సేకరిస్తారు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -