తల్లిపాల ప్రాముఖ్యత ప్రపంచ దేశాలు గుర్తించాయి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తల్లిపాల ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయని ప్రతిఒక్కరూ పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగులో గల కొలెస్ట్రామ్ అనే ముర్రుపాలను అప్పుడే పుట్టిన చిన్నరికి ఖచ్చితంగా తాగించాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్ జి గార్డెన్లో సోమవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో 1991 నుండి తల్లి పాల వారోత్సవాలు జరుగుతున్నయని, ప్రతిఒక్కరు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను ఇవ్వాలని ,ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు ప్రసూతి రక్షణ పథకం కింద ప్రసూతి ప్రయోజనా సవరణలతో 2017 చట్టం చేసిందన్నారు. రంగంలో పని చేస్తున్న మహిళలకు ప్రసూతి ప్రయోజనా ప్రాధాన్యత ఉందని ఇందులో 26 వారాలు పూర్తి చేయటంతో కూడిన ప్రసూతి సెలవు లభిస్తుందని అన్నారు. గనులు, తోట పనులు దుకాణాలు, కార్మగారాలు పని చేస్తున్న మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుందని, 50 మంది ఉద్యోగస్తులు పని చేస్తున్న ప్రతి సంస్థలను పిల్లల సంరక్షణకు కృషి ,సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని పెర్కోన్నారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత మాట్లాడుతూ ప్రతిఒక్క తల్లి కూడా పిల్లలకు ముర్రు పాలు తల్లికి రొమ్ముక్యాన్సర్ గానీ గర్భసంచికి క్యాన్సర్ గానీ రాకుండా ఉంటుందన్నారు. ప్రసవం జరిగిన తర్వాత తల్లిపాలు ఇవ్వటంతో రక్తస్రావం తగ్గిపోతందని, యదాస్థానంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమీషన్ సభ్యురాలు సుదాం లక్ష్మీ, సీడీపీఓ స్వర్ణలత, రసూల్బీ, ఎంపీడీఓలు గోపిబాబు, లక్ష్మణ్, పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ దీపక్ రాథోడ్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి వై. శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు పి.రాజేందర్, ఐకెపి ఎపియంలు సువర్ణ, నాగరాజు, అంగన్ వాడి పర్యవేక్షకులు, అంగన్వాటీ టీచర్లు, ఆశావర్కర్లు, కార్యకర్తలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Spread the love