అంగన్వాడి కేంద్రం లో కార్యక్రమం, కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ- కంటేశ్వర్

పోషణ మాసం సందర్భంగా జలాల్పూర్ అంగన్వాడి కేంద్రం నిజామాబాద్ రూరల్ మండలంలో బుధవారం కార్యక్రమం, కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు నిజాంబాద్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ సౌందర్య తెలిపారు. దీనిలో మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గూర్చి మురుపాల గూర్చి తల్లిపాలు 6 నెలల వరకు కచ్చితంగా బిడ్డలకు ఇవ్వాలని ఆ తర్వాత కూడా తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలని లబ్ధిదారులందరికీ తెలియజేయడం జరిగింది గర్భిణీ  బాలింతలు కచ్చితంగా అంగన్వాడి కేంద్రం నందు భోజనం చేయాలని అదేవిధంగా ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను వేసుకోవాలని గర్భిణీలు నాలుగు చెకప్ లు చేసుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ నందు డెలివరీ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు అంగన్వాడీ కేంద్రంలో బరువు ఎత్తులు తూచిన పిల్లలను నార్మల్ గా ఉన్న పిల్లలను గుర్తించి  వెల్ బేబీ షో కార్యక్రమం నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అంగన్వాడి పిల్లలతో ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Spread the love