గుర్తింపు కార్మిక సంఘాలే కొంపముంచాయి

– వేతన సవరణలో గుర్తింపు సంఘాల కార్మికులకు అన్యాయం చేశారు
– ఒకే సంస్థలో నాలుగు కార్మిక సంఘాలకు ఎలా గుర్తింపునిచ్చారు
– విద్యుత్‌ సంస్థలో వెంటనే కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపాలి
– టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర రావు
నవతెలంగాణ-బాలానగర్‌
సీఐటీయూ అనుబంధ విద్యుత్‌ కార్మిక సంఘం తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ సర్కిల్‌ సమావేశం గురువారం యూనియన్‌ రీజినల్‌ అధ్యక్షులు వై. విక్రమ్‌ రెడ్డి అధ్యక్షతన అల్వాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. ఈశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణా విద్యుత్‌ సంస్థలో 7 శాతం వేతన సవరణకు అంగీకరించి నాలుగు ప్రధాన కార్మిక సంఘాలు కార్మికులకు అన్యాయం చేశాయని దీనిములంగా సంస్థలో పనిచేస్తున్న అర్టిజన్‌ కార్మికులకు, ఉద్యోగులకు నష్టం జరిగిందని అన్నారు. ప్రధానంగా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరపకుండా నాలుగు కార్మిక సంఘాలకు ఎలా గుర్తింపు ఇచ్చారని ప్రశ్నించారు. సంస్థలో పనిచేస్తున్న అర్టిజన్‌ కార్మికులకు కూడా ఓటు హక్కు ఇచ్చి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. సంస్థలో పనిచేస్తున్న ఆర్తిజన్‌ కార్మికులకు కన్వర్షన్‌ ఇవ్వాలని అంతే కాకుండా పీసురేటు, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌ డివిజన్‌ పరిధిలోని 327, హెచ్‌-82 యూనియన్ల నుండి డి. ఆనంద్‌ ఎల్‌.రాంబాబు జి. వెంకటయ్య జి. మధు ఎం.శ్రీను నాయక్‌ జి. జీవన్‌ కుమార్‌, ఎల్‌. నరసింహ, షీలా, జె. భద్రి, జి. వీరేందర్‌, ఎండి. ఖాద్రి ప్రవీణ్‌, పి. సాగర్‌, టి. కిరణ్‌ కె. గోవింద్‌, ఇ. మల్లేష్‌, టి. వెంకటేష్‌ సాగర్‌ తదితర ఆర్టిజన్‌ కార్మికులు రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో సీఐటీయూ చేరారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జె.ప్రసాద్‌ రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి నాయకులు వేంకటేశ్వర్లు ప్రభాకర్‌ బిక్షపతి మోహన్‌ పాల్గొన్నారు.

Spread the love