సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్
ఈడీకి నోటీసులు పంపడంలో వైఫల్యంపై ఆగ్రహం
నిజ నిర్ధారణ విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన లోపంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసులు పంపకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఒక కీలకమైన న్యాయ ఆదేశాలు అమలు కాలేకపోయిన ఘటనపై నిజనిర్ధారణ విచారణకు ఆదేశించారు. వివరాళ్లోకెళ్తే… సుప్రీంకోర్టు ఒక కేసులో ముందుగా ఇచ్చిన ఆదేశంలో ఈడీకి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే రిజిస్ట్రీ తయారు చేసిన ఆఫీస్ రిపోర్ట్‌లో అలాంటి ఆదేశం ఇవ్వలేదని పేర్కొనడం గమనార్హం. ఈ అంశాన్ని విచారించిన బెంచ్‌లో సీజేఐ సూర్యకాంత్ పాటు న్యాయమూర్తి జోరుమాల్యా బాగ్చి ఉన్నారు. రిజిస్ట్రీ ఈ తప్పిదంపై సీజేఐ తీవ్రంగా స్పందిస్తూ.. ” రిజిస్ట్రీ చాలా చెత్తగా పని చేస్తోంది. వాళ్లు తమను తాము సూపర్ సీజేఐగా భావిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. రిజిస్ట్రార్ (జ్యుడిషియల్)ను వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆదేశం ఎందుకు రికార్డుల్లోకి చేరలేదో, ఎందుకు నోటీసు పంపలేదో వివరించాల్సిందిగా కోరింది. సీజేఐ ఈ ఒక్క ఘటనే కాకుండా.. ఇలాంటి లోపాలు గతంలో కూడా జరిగినట్టు సూచిస్తూ లోతైన విచారణ అవసరమని తెలిపారు. రూ.37వేల కోట్ల పెట్టుబడి మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయుషి మిట్టల్ ఎలియాస్ అయుషి అగర్వాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే కీలక వ్యవస్థ అయిన రిజిస్ట్రీలో జరిగిన ఈ లోపం.. న్యాయవ్యవస్థలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీజేఐ ఆదేశించిన విచారణ తర్వాత ఈ ఘటనకు బాధ్యులెవరో తేలే అవకాశం ఉంది.
రిజిస్ట్రీ చాలా చెత్తగా పని చేస్తోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



