Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్ధం

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

కేవీపీఎస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్దమని ప్రముఖ సీనియర్‌ అంబేద్కర్‌ వాదులు డాక్టర్‌ జె బి రాజు, డాక్టర్‌ పికట్ల భరత్‌ భూషణ్‌ లు అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన ‘దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు, భరత్‌భూషణ్‌ మాట్లాడుతూ దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే రాజ్యాంగపరమైన హక్కులు, ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు 33 పేజీల తీర్పు కోట్లాదిమంది దళితుల గుండెపై దాడి చేసిందిని . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15,25లను హత్య చేసిందని
బౌద్ధం సిక్కు మతాలలోకి వెళితే రాజ్యాంగ హక్కులు యధావిధిగా ఉన్నప్పుడు కేవలం క్రైస్తవంలోకి వెళితే మాత్రమే రాజ్యాంగ హక్కులు చట్టాలు రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోతాయని . ఈ తీర్పుపై కేంద్రం సుప్రీం కోర్టుఫుల్‌ బెంచ్‌ కు వెళ్లి రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులకు వర్తింపచేయాలని ప్రముఖ సీనియర్‌ అంబేద్కర్‌ వాదులు డాక్టర్‌ జె బి రాజు డాక్టర్‌ పికట్ల భరత్‌ భూషణ్‌ లు డిమాండ్‌ చేశారు..
ఆదివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్లో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్‌ జె బి రాజు డాక్టర్‌ పికట్ల భరత్‌ భూషణ్‌ లు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కాకుండా మత విశ్వాసాల ఆధారంగా ఆ తీర్పు వెలువడిందని తెలిపారు.

కులం పుట్టుకతో వస్తుందననీ, తను నచ్చిన మతాన్ని స్వీకరించటం విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా నడుచుకుంటారని పేర్కొన్నారు. మతం ఆధ్యాత్మిక విశ్వాసం. కులం సామాజిక వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఒక అవిభాజ్యమైన ప్రక్రియ అని చెప్పారు. క్రైస్తవంలోకి వెళ్లినవారిలో దళితులుగా మాత్రమే కులవివక్ష అంటరానితనానికి ఎందుకు గురవు తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన కులవివక్ష అంటరానితనం పొవట్లేదని రుజువులు ఉన్నాయన్నారు. అగ్రకులాల్లో పుట్టి క్రైస్తవాన్ని పుచ్చుకున్న వారు తమ సామాజిక హోదాగా ఉన్నత కులం ఆధారంగానే గౌరవించబడుతున్నారనీ, మతం మారినప్పటికీ చర్చిలు కూడా కులాల వారిగా ఉంటున్నాయని చర్చిలలో కూడా స్వకుల వివాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు 15శాతం రిజర్వేషన్‌ పొందుతున్న వారు దళితులు క్రైస్తవం పుచ్చుకుంటే 1శాతానికి వారి రిజర్వేషన్‌ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో గుడిలోకి రానీయకపోయినా బడిలో చదువుకోనీయకపోయినా క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్స్‌ క్రిస్టియన్‌ మిషనరీస్‌ హాస్పిటళ్లు, చర్చిలు సంపూర్ణంగా దళితుల్ని చేరదీశాయని చెప్పారు. ఎల్లయ్య అనే పేరిట దళితుడు హిందూ సమాజంలో ఉంటే ఎల్లిగాడు అని అవమానిస్తున్న స్థానంలో చర్చికి వెళితే ఏలియా అని పిలువబడుతున్నాడని గుర్తు చేశారు. మతం మారినంత మాత్రాన తమ బ్రతుకు లు మారడం లేదని వారు ఎదుర్కొశీటున్న కులవివక్ష పోవడం లేదన్నారు.
స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ మోడీ 12 ఏండ్ల పరిపాలన కాలంలోనే దళితులపై దాడులు దౌర్జన్యాలు 300 రెట్లు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీజేపీ మతోన్మాద విధానాలపై పోరాటం చేయకుండా దళితుల హక్కులు రక్షించుకోలేమని చెప్పారు. 2018 లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ప్రతీ పౌరుడు ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగా ఆ తీర్పు వెనక్కి తీసుకున్నదని తెలిపారు. అదే స్ఫూర్తితో 2026 మార్చి 24న వచ్చిన తీర్పును వెనక్కి తీసుకునేంతవరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలు
– మార్చి 24న వెలువడించిన సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగ స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఫుల్‌ బెంచ్‌ కి వెళ్ళాలి
– రాజ్యాంగ విరుద్ధంగా 1950 లో తెచ్చిన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ను రద్దు చేయాలి
– కేజీ బాలకష్ణన్‌ కమిషన్‌ నివేదికను బహిర్గతపరచాలి
– దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను అరికట్టాలి
– దళిత క్రైస్తవులు రాజ్యాంగాన్ని బైబిల్‌ 2చేతుల్లో పట్టుకొని రాజకీయ చైతన్యం ద్వారా చర్చిలో ప్రార్ధన రోడ్‌ పై శాంతియుత ప్రదర్శన నిర్వహించాలి
కార్యాచరణ
– నేటి నుంచి(సోమవారం)20వరకు జిల్లా స్థాయి సదస్సులు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలి
– ఈ నెల 21నుండి 30వరకు జిల్లా మండల కేంద్రాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టాలి

సమావేశంలో టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్‌ జి రాములు, ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, ఉపాధ్యక్షులు డేవిడ్‌ కడారి, రాష్ట్ర అధ్యక్షులు గిడియన్‌ , జ్యోతి నీలయ్య, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌ అరుణ జ్యోతి, డి హెచ్‌ పి ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జి రాములు, కె రమేష్‌, బాలోత్సవం నాయకులు మహేష్‌ దుర్గే, కేవిపిఎస్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -