Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వాస్పత్రుల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

– లేకుంటే ఈ నెల 25న ధర్నాలు చేస్తాం
– మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, టీవీవీపీ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్‌ రద్దు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25న ధర్నాలు చేయనున్నట్టు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లారయూస్‌ యూనియన్‌ ప్రకటించింది. దానికి సంబంధించిన ధర్నా నోటీస్‌ను సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు, టీవీవీపీ కమిషనర్‌కు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లారయూస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షలు భూపాల్‌, అధ్యక్ష?్నలు ఎమ్‌డీ ఫసియొద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ అందజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్స్‌, మెడికల్‌ కాలేజీలు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని కవ¶్యనిటీ హెల్త్‌ సెంటర్స్‌, ఏరియా హాస్పిటల్స్‌, జిల్లా ఆస్పత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, పేషంట్‌ కేర్‌, వానిటేషన్‌, స్వీపర్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌ చాలా సమస్యలతో బాధపడుతున్నారని ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 15600 వేతనంలో కార్మికునికి రూ.12,093 ఇచ్చి మిగతా సొమ్మును ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఖాతాలో జమచేయాలని తెలిపారు. అయితే, కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయ్యి రూ.11 వేల వేతనాన్నే చెల్లిస్తున్నాయని వాపోయారు.
పీఎఫ్‌, ఈఎస్‌ఐల ఎంప్లాయూ, ఎంప్లాయర్‌ రెండు షేర్లనూ కార్మికుని వేతనం నుంచే కట్‌ చేస్తున్న విషయాన్ని ఎత్తిచూపారు. ఇచ్చే అరకొర వేతనం కూడా రెగ్యులర్‌గా ఇవ్వడం లేదని వాపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలనీ, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలనీ, కాంట్రాక్టర్ల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పూర్తి వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హాస్పిటల్‌ వర్కర్స్‌కు డ్రైస్‌ చేంజ్‌ రూములు లేకపోవడంతో పేషంట్‌ టాయిలెట్స్‌, బాత్‌రూమ్‌లలో డ్రైన్‌ చేంజ్‌ చేసుకుంటున్న నేపథ్యంలో వారికి రెస్ట్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలనీ, ఐడి కార్డు, యూనిఫామ్‌, గ్లౌజులు, షఉస్‌, ఇతర పరికరాలు అందజేయాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -