భారీగా పెరగనున్న రోడ్ల డ్యామేజీ నష్టం

– రూ. 1047.68 కోట్లకు చేరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. శనివారం నాటి లెక్కల ప్రకారం 1064 రోడ్లు ధ్వంసమయ్యా యి. 1416.36 కిలోమీటర్ల మేర రోడ్లు కోసుకుపోవడం, తెగడం, కొట్టుకుపోవడం, కల్వర్లు బిడ్జ్రీలు కూలిపోవడం తదితర పరిణా మాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా తక్షణం ప్రభుత్వం రూ.1047.68 కోట్లు కేటాయిస్తే తప్ప వాటిని పునరుద్దరించే అవ కాశం లేదని సమాచారం. ఈమేరకు పంచా యతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ ఉన్నతాధికా రులు ప్రతిరోజూ జరిగిన నష్టం వివరాలతోపాటు పునరుద్ధరణకు కావాల్సిన నిధుల సమాచారం తో కూడిన నివేదికను సర్కారుకు పంపుతు న్నారు. ఇందులో ఎక్కువగా రోడ్ల ధ్వంసానికి రూ.539.44 కోట్లు, కల్వర్టు బిడ్జ్రీల మరమ్మతు ల కోసం రూ.380.57 కోట్లు అవసరమని అధికారిక సమాచారం. అలాగే రోడ్లు పూర్తిగా తెగిపోయిన వాటికి రూ.57.95కోట్లు కావాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

Spread the love