ఆర్ఎంపీ, పీఏంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు
ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
గత నలభై ఏళ్లుగా నిరుపేద ప్రజలకు గ్రామీణ వైద్యుడు ఎరుకొండ సాంబయ్య అందించిన సేవలు చిరస్మరనియమని ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్ల రాజు, ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అన్నారు. సాంబయ్యకు కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయలై, ఇటీవల అస్వస్థకు గురై అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం సాంబయ్య స్వగ్రామం జంగెడులో రాజు, కుమార్ యాదవ్ మృతుని కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు అసోసియేషన్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంబయ్య ఆర్ఎంపీ సంఘానికి, నిరుపేద ప్రజలకు అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఆయన అకాల మరణం సంఘానికి తీరని లోటన్నారు.
గ్రామీణ వైద్యుడు సాంబయ్య సేవలు చిరస్మరనియం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



