స్నేహ సొసైటీ సేవలు అభినందనీయం

నవతెలంగాణ –  కంటేశ్వర్
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ సేవలు అభినందనీయమని స్నేహ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ అన్నారు.ఆదివారం స్థానిక మారుతినగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్స్ ప్రధాన కార్యలయం నందు స్నేహ సొసైటి ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్స్  32వ వార్షిక సాధారణ సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్  పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ సొసైటీ 32 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు. ఒక సంస్థ ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా పనిచేయడానికి కార్యదీక్ష, అంకితభావం, కష్టపడే సిబ్బంది ఇవన్నీ ఉన్న స్నేహ సొసైటీని ఈ సందర్భంగా అభినందిస్తున్న మన్నారు.స్నేహ సొసైటీ రాబోయే కాలంలో వికలాంగుల సాధికారత కొరకు మరిన్ని పథకాలను చేపట్టి నిర్వహించాలని తెలిపారు. అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వ తోడ్పాటు ఉండాలని ఆయన కోరారు. స్నేహ సొసైటీ గత 32 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందింది అని తెలిపారు. రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో అవార్డులు ఆచాయాన్ని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రాక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక ప్రణాళిక ద్వారా వనరులను సమకూర్చుకుంటామని తెలిపారు.
స్నేహ సొసైటీ అందించే అన్ని కార్యక్రమాలు అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అంతకుముందు స్నేహ సొసైటీ కార్యదర్శి యస్. సిద్దయ్య స్నేహ సొసైటీ వార్షిక నివేదికను సాధారణ సభకు సమర్పించారు. ఈ నివేదికలో 2023 24 సంవత్సరంలో స్నేహ సొసైటీ చేపట్టి నిర్వహిస్తున్న కార్యక్రమాలు కార్యక్రమ నిర్వహణకు నిర్వహించబడ్డ సిబ్బంది, సంస్థ ఆదాయము, వ్యయము, సాధించిన విజయాలను సభకు తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ యస్. జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలకు సంబంధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. సీనియర్ ఉపాధ్యాయుడురమేష్ అందుల ప్రత్యేక పాఠశాలకు సంబంధించిన విషయాల గురించి తెలిపారు. స్నేహ  టార్గెట్ ఇంటర్ వెన్షన్ హెచ్ఐవి ప్రోగ్రాం మేనేజర్ మోహిద్ అహ్మద్ కార్యక్రమాల గురించి సభకు వివరించారు. రాజేందర్ మంచిర్యాల గురించి తెలిపారు. సఖి కేంద్రం నిజామాబాద్ లీగల్ కౌన్సిలర్ లావణ్య సభకు కార్యక్రమాల గురించి తెలిపారు. 100 విద్యార్థుల శకుంతల ఆస్మా తమ మధురమైన పాటలతో ఆకట్టుకున్నారు. స్నేహ సూసైడ్ కార్యవర్గ సభ్యులు టి సుధాకర్ జివి రమణ రెడ్డి తాటి వీరేశం కోశాధికారిని శివ ప్రసన్న శ్యాంసుందర్ లు స్నేహ సొసైటీ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ యస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, యన్ విమల లనుఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ ప్రధాన కార్యదర్శి యస్. సిద్దయ్య ,కోశాధికారిణి శివ ప్రసన్న, సహాయ కార్యదర్శియస్.దయానంద్ కార్యవర్గ సభ్యులు సాటి వీరేశం శ్యాంసుందర్ లడ్డ, టి సుధాకర్ రమణారెడ్డి లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ వివిధ కార్యక్రమాల సిబ్బంది మానసిక వికలాంగ విద్యార్థులు అంద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love