మహిళల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

నవతెలంగాణ – చిన్నకోడూరు
మహిళల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎంపిపి మాణిక్యరెడ్డి లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో ఋతు ప్రేమపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలకు క్లాత్ ప్యాడ్స్ ను అందజేశారు. మహిళలు ప్లాస్టిక్ కప్స్ వాడితే అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా సిద్ధిపేట జిల్లాలో రుతు ప్రేమపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మహిళలందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్లాత్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి మహిళ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని, ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం సిఎం కేసిఆర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ పై విధి విధానాలు రూపొందించాలని ప్రకటించడం పట్ల పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ లింగం, సర్పంచ్ విజయ లింగం, ఎంపీటీసీ సరిత, పరుశరాములు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ సోమిరెడ్డి, ఏపీవో మహిపాల్, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love