ఆకాశంలో కనువిందు చేసిన సూర్యుడు..

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఆదివారం సాయత్రం సమయంలో సూర్యుడిని కప్పేస్తున్న మబ్బులు, సాయంత్రం సమయంలో సూర్యుడు బంగారు చాయలతో దర్శనం ఇవ్వడంతో ఆకాశంలో సూర్యుడు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ దృశ్యం మండల వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సూర్యుడు చాలా రేర్‌గా ఇలా కనిపిస్తాడని అంటున్నారు. సూర్య కాంతిని కారుమబ్బులు అడ్డురావడం, సూర్యుడు బంగారు ఛాయ వెలుతురు రావడంతో ఆకాశంలో వింతగా అనిపించింది. ఈ దృశ్యాలను ప్రజలు తిలకించారు.

Spread the love