ప్రజల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

– కాకుల మర్రి లక్ష్మణబాబు
నవతెలంగాణ- గోవిందరావుపేట
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాయికుమార్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తో పాటు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై మాట్లాడారు. కార్యకరకార్యకర్తల సమిష్టి కృషితోనే బీఆర్‌ఎస్ పార్టీ ఈ స్థాయిలో వృద్ధి చెందిందన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండంగా ఉంటుంది. దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం పార్టీ తరపున సంక్షేమ కార్యక్రమాలని నిర్వహించడం ఒక్క బి ఆర్ఎస్ కు మాత్రమే సాధ్యం  కార్యకర్తలందరినీ సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు.
     దాదాపు 60 లక్షల మంది ఉన్న కుటుంబం మన బీఆర్ఎస్ వారికి ఆపద సమయాల్లో తోడుగా ఉండాలనే మంచి ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 60 లక్షల మంది కోసం భీమా సదుపాయాన్ని కల్పించిన ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీ అని దాదాపు 45 కోట్ల రూపాయలను ఇప్పటివరకు భీమా కోసం వెచ్చించడం జరిగిందన్నారు. దేశ రాజకీయాలను బి ఆర్ఎస్ ప్రభావితం చేయడం తధ్యం . ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు , పథకాలను కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విషయం మీకు తెలిసిందేనన్నారు.బి ఆర్ఎస్ పార్టీ ముద్ర భారతదేశ రాజకీయ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ప్రత్యేక తెలంగాణ సాధన అనే ఒకే లక్ష్యంతో ఉద్యమం చేసి , ఆ లక్ష్యాన్ని సాధించి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్న ఘనత బి ఆర్ఎస్ పార్టీది అని వారన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల ఇన్చార్జి ఎస్ సామారావు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, జడ్పిటిసి తుమ్మల హరిబాబు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎంపీటీసీలు వెలిశాల స్వరూప,ఆలూరి శ్రీనివాసరావు, ఎండి బాబర్ మండల కో ఆప్షన్ సభ్యుడు,  రైతు మండల అధ్యక్షులు సూరనేని రవీందర్రావు, మచ్చాపూర్ సర్పంచ్ రేగూరి రవీందర్,పిఎసిఎస్ సూది రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సర్పంచులు ఈసం సమ్మయ్య, ఇక అంజి బాబు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గోవిందరావుపేట మోహన్ రాథోడ్, సింగం శ్రీలత, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చందూలాల్,వట్టం నాగరాజు, బత్తుల రాణి, మండల ఉపాధ్యక్షులు చుక్కగట్టయ్య, గ్రామ రైతు కోఆర్డినేటర్లు కొలసాని శ్రీనివాసరావు, పి శ్రీ రామ్ రెడ్డి,బొల్లం ప్రసాద్, మండల బీసీ సెల్ అధ్యక్షులు నాగాచారి, గోవిందరావుపేట మహిళ అధ్యక్షురాలు బత్తుల రాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love