రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన “సిద్దాంతపు” కవిత

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన సాహిత్యదినోత్సవ వేడుకల్లో జరిగిన కవిసమ్మేళనంలో అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ కవి డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు కవిత “కొత్త ఆశలవైపు” రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికఅయింది.  ఈ మేరకు మంగళవారం సాయింత్రం జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారాన్ని ప్రభాకరాచార్యులు అందుకున్నారు. 170 కవితలు ఈ పోటీలో పాల్గొనగా 9 మంది రచనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. తన కవిత రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ప్రభాకరాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటికే పలు కవితలకు జాతీయస్థాయిలో బహుమతులు పొందిన ప్రభాకరాచార్యులు కవిత్వానికి తాజాగా రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love