అశ్వారావుపేట వేదికకగా పురుడు పోసుకున్న ఆయిల్ ఫాం రైతు సంఘం..

– ఫాం ఆయిల్ రైతు రాష్ట్ర సదస్సులో ప్రకటించిన ఐలయ్య
– రాష్ట్ర కన్వీనర్ గా కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వేదికగా ఆయిల్ ఫాం సాగుదారుల సంఘం మరొకటి పురుడు పోసుకుంది.ఈ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనతో పాటు మరో 17 మందిని కన్వీనింగ్ కమిటీ సభ్యులుగా మంగళవారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆయిల్ ఫాం రాష్ట్ర సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య ప్రకటించారు. తెలంగాణ లోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజక వర్గం,అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో సాగు అవుతున్న ఉద్యాన పంట ఆయిల్ ఫాం సాగు.ఇప్పటి కే పలు రైతు సంఘాలు ఉనికిలో ఉన్నప్పటికీ కార్యాచరణలో అంతంత మాత్రంగానే ఆసక్తి చూపుతున్న నాయకులు ఉన్నారు.ఈ నేపద్యంలో మరో సంఘం ఉనికిలోకి రావడం హర్షణీయం. కన్వీనర్ గా ఎంపిక అయిన కొక్కెరపాటి పుల్లయ్య ఇప్పటికే తెలంగాణ రైతు సంఘం బాధ్యత ల్లో ఉన్నారు. ఉద్యమాల నేపద్యంలో ఎదిగిన నాయకుడిగా,నియోజక వర్గం లోనే మేజర్ పంచాయితీ అశ్వారావుపేట కు రెండు దఫాలు సర్పంచ్ గా సేవలు అందించిన ప్రజాప్రతినిధిగా గుర్తింపు ఉంది. పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ గా కొక్కెరపాటి పుల్లయ్య,కమిటీ సభ్యులుగా జలసూత్రం శివరాం ప్రసాద్, తుంబూరు మహేశ్వర్ రెడ్డి,దొడ్డ లక్ష్మీనారాయణ,ఆళ్ల నాగేశ్వరరావు,మేక అశోక్ రెడ్డి, కలపాల భద్రం,కొత్తపల్లి రమేష్ బాబు,చింత నిప్పు చలపతిరావు,కొప్పుల కృష్ణయ్య,నున్న నాగేశ్వరరావు, తలసిల ప్రసాద్, మొరంపూడి వెంకటేశ్వరరావు, కరుటూరి కృష్ణ,మడకం శాంతి,సయ్యద్ పాషా, తోటపల్లి వీరభద్రం, గడ్డిపాటి సత్యంతో పాటు మరికొద్ది మంది కోఆప్షన్ సభ్యులతో కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు అయింది.

Spread the love