ఏమి సాధించారని ఈ సంబరాలు..

– సిపిఐ (ఎంఎల్) జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి
నవతెలంగాణ దంతాలపల్లి : తెలంగాణ ఏర్పడి రెండు దశాబ్దాలు గడిచిందని ప్రజల ఆకాంక్షలు కోరికలు నెరవేర్చని కెసిఆర్ ప్రభుత్వం ఈ దశాబ్ది సంబరాలు చేసే హక్కు ఉందా అని సిపిఐ (ఎం ఎల్) ప్రజాపంద ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రశ్నించారు. జూన్ 2 నుండి 12 వరకు జిల్లా , డివిజన్,మండల కేంద్రాల్లో దీక్ష దివాస్ జరుపమని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ యువకులు ఆత్మబలిదానంతో భౌగోళిక తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలు ఇచ్చిన హామీ ఎండమామిలా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయాలని, వర్షాకాలం సాగుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజపల్లి వీరన్న, జిల్లా నాయకులు కే రాజేశ్వర్ రెడ్డి, సిగ్గం యాకయ్య, ఉడుగుల రాములు, కొమ్మనబోయిన వెంకన్న, యాకయ్య ,లింగయ్య, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love