రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు..

నవతెలంగాణ దంతాలపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం దంతాలపల్లి మండలం బొడ్లాడ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న  విజయ్ కుమార్ చెరువుల పండుగ కార్యక్రమం పనులు నిర్వహించడానికి గ్రామ ప్రత్యేక అధికారితో  బండిపై వెళుతుండగా ప్రమాదం జరగడం వలన తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు.
Spread the love