నాగార్జున సాగర్ లో  త్రిముఖ పోటీ

– ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ ప్రచారం
– కాంగ్రెస్ కు అనుకూల పవనాలు
– బీఆర్ఎస్ కష్టమే అంటున్న సర్వేలు
నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్,కాంగ్రెస్ నుంచి కుందూరు జయవీర్ రెడ్డి, బీజేపీ నుంచి కంకణాల నివేదిత రెడ్డి అధిష్టానాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో నియోజకవర్గంలో ఈ సారి ఆసక్తికర పోరు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు వివిధ రూపాలలో ప్రచారం మొదలుపెట్టారు.
రెండవ సారి భగత్ జయించేనా..?
ప్రస్తుత ఎమ్మెల్యే నోములు భగత్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన 2020ఉప ఎన్నికలో లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు రెండవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని పార్టీ క్యాడర్ తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే రాష్ట్ర క్యాబినెట్ హోదా రావడం పక్కా అని ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రజలు తమ అసంతృప్తిని బహిరంగానే తెలుపుతున్నారు.సాగర్ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి శగలు గుప్పు మంటున్నాయి. తన తండ్రి మరణంతో ఎం ఏల్ ఏ గా గెలిచినప్పటినుంచి అసమ్మతి ఎక్కువైంది.దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కాపాడు కొనుటకు నానా తంటాలు పడుతున్నారు.
 జయవీర్ కల నెరవేరేనా..?
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనే ఆశతో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు జయవీర్ ఎమ్మెల్యే కావాలనే కోరిక నెరవేరుతుందా అని కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం రేపుతుంది. సాగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనే ఆశతో జయవీర్ టికెట్ సాధుంచు కూన్నారు. గతంలో కాంగ్రెస్ కంచు కోట అయిన సాగర్ ప్రస్తుతంజేపీ బీఆర్ఎస్ గా మారింది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరాలని మాజీ మంత్రి జానారెడ్డి  ప్రత్యేక ప్రణాళికలు రచించారు.దీంతో సాగర్ నియోజకవర్గం లో గతంలో పార్టీని వీడిని వారంతా కాంగ్రెస్ లో చేరారు. పెదవూర, అనుముల, గుర్రంపోడ్, నిడమానూరు, తిరుమల గిరి సాగర్ లో ఇప్పటికే చాలా మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.దసరా పండుగ కూడా అయిపొవడం తో మంచి రోజున ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేయనున్నారు.నాగార్జున సాగార్లో 7సార్లు జరెడ్డి విజయం సాదించారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆయన తనయుడు జయవీర్ ఇప్పించారు. ఎలాగైనా తనయున్ని గెలిపించు కోవాలని జనారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ఖ్యాడర్ ను బలోపితం చేస్తూ తనదైన శైలి లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 2018లో నోముల నరసింహమ్మాయ్య జనారెడ్డి గెలుపొందారు. 2020లో అనారోగ్యం తో నరసింహమ్మాయ్య మృతి చెందారు.ఆతరువాత2020 లో జరిగిన ఉప ఎన్నికలో అయన తనయుడు నోముల భగత్ విజయం సాదించారు. అయితేగత నెల రోజులు ముందు వరకు సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగానే వుంది. కానీ ఇప్పుడు అపరిస్థితి అంతా మారిపోయింది. జనారెడ్డి గతంలో పార్టీ వీడిన వారినందరిని తిరిగి పార్టీ లోకి ఆహ్వానించారు. దాంతో సాగర్ నియోజకవర్గం లోని అన్ని మండలాలలో బిఆర్ఎస్ భారీ షాక్ తగిలింది. వేలాదిగా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దవూర, గుర్రంపోడ్, అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాలలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి.అయినా నిరుత్సాహం చెందకుండా ప్రజల మధ్యనే బీఆర్ఎస్ నాయకులు తిరుగుతూ ప్రచారన్ని హోరేత్తిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రేస్, బీఆర్ఎస్ గ్రామాల్లో చాప కింద నీరులా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఒకే పార్టీలో ఉండి ప్రజా వ్యతిరేకత పొందడంతో తనకు అనుకూలంగా ఉంటుందని, సానుభూతి ఓట్లతో ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలన్న కసితో బి ఆర్ ఎస్ కార్యకర్తలు కష్టపడుతున్నారు. నామినేషన్ల ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తుంది.
Spread the love