ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

నవతెలంగాణ – పెద్దవంగర
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న మండల వాసులకు కాస్త ఊరట లభించించింది. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉన్నది. గత మూడు రోజుల నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న మండల ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
Spread the love