మొటిమలు పోవాలంటే…

మహిళలు మొటిమల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీటిని తొలగించడానికి ఏవేవో క్రీములు ఉపయోగిస్తుంటారు. ఈ మొటిమలను కొన్ని చిన్న చిన్న వంటింటి చిట్కాలతోనే పోగొట్టుకోవచ్చు..
– అన్నీ రకాల చర్మ వ్యాధుల్నినిమ్మకాయ రసం అరికడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి వల్ల విషపు కణాలు దూరం అవుతాయి.
– చిటికెడు పసుపు, చిటికెడు నిమ్మరసాన్ని కలిపి ఆ పేస్టును మొటిమలు ఉండే ప్లేస్‌లో అప్లైరు చేస్తే ఎలాంటి మచ్చలైనా తొలగిపోతాయి.
– కలబంద గుజ్జును, నిమ్మ రసాన్ని కలిపి ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా చేస్తే మొటిమలు పోవడమే కాక ముఖం ప్రశాంతవంతంగా మారుతుంది.
– బంగాళదుంప ముక్కల్ని ముఖంపై ఉన్న మచ్చలపై రుద్దితే ఫలితం ఉంటుంది.
– దోసకాయ గుజ్జు పాల మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love