నేడు మేడారం లో పొట్ట పండగ

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు బుధ, గురువారాలలో మేడారం పూజారులు పొట్టపండగ ను ఘనంగా ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూజారులు, ఆదివాసీలు పండించిన వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను పొట్టదశలో సేకరించి వన దేవతలకు సమర్పించడం ఆనవాయితీ. బుధవారం ఉదయం నుండి గురువారం తెల్లవారుజాము వరకు నిర్వహించే ఈ ఉత్సవానికి పూజారులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. అందుకు అన్నిరకాల ఏర్పాట్లుచేయాలని పూజారుల సంఘంఅధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు.
Spread the love