నేడు ప్రపంచ భద్రతారోగ్య దినోత్సవం

– కార్మికులందరికీ భద్రత ఆరోగ్యం కల్పించాలి: బెల్‌ భద్రతాధికారి
– గోగు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
భద్రత ప్రచారమే పరమావధిగా భా వించి పని ప్రదేశంలో కార్మికులందరికీ భద్రత, ఆరోగ్యం ప్రపంచవ్యాప్తంగా కల్పించాలని ఐక్య రాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 28వ తేదీని నిర్ణయించింది. ప్రపంచ భద్రత దినోత్సవ సంబురాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని కర్మాగారాలు కార్యాలయాలు త ప్పకుండా అధికారికంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సంస్థ వారు పిలుపునిచ్చారు. ఈ వేడుకను భా రతదేశంలో 2003 నుండి జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా ఒక అంశాన్ని నిర్ణయిం చారని వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యంపై వాతావరణ మా ర్పుల ప్రభావం అందులో భాగంగానే వివిధ వృత్తిప రమైన ఆరోగ్య భద్రత కార్యక్రమాల రూపేనా వివిధ సం స్థల యాజమాన్యం వారు పని ప్రదేశంలో భద్రతా ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మనదేశంలో ప్ర మాదం లేని పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి, పని ప్ర దేశంలో గాయాలను నివారించడానికి సమర్ధవం తమైన భద్రతా సిబ్బంది భద్రతా కమిటీలు సిద్ధంగా అన్నివేళలా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భద్రత పరికరాలు ధరిస్తూ సురక్షితమైన పరిస్థితుల్లోనే విధులు నిర్వహించాలనే దక్పథంపైనే ప్రధానంగా ప్రమాదాల నివారణ ఆధారపడి ఉంది. కర్మా గారాల్లో విధులు నిర్వహించే వా రందరి భద్రత, శుభ్రత, ఆరోగ్యం కోసం యాజమాన్యం భరోసా ఇ స్తుంది. అందువలన పనులు నిర్వ హించే ప్రాంతాలతో పాటు పరిస రాలను కూడా ప్రమాద రహితం గా మలుచుకోవడం, ప్రమాదాల బారి నుండి కాపాడే అవసరమైన రక్షణ పనిముట్లను అందించడం, సురక్షితంగా విధులు నిర్వహించడానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు కార్మికులకు మేనేజ్మెంట్‌ వారు తు.చ. తప్ప కుండా అందించాలి. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ విషయంలో కర్మాగారాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ చాలా చురుకైన పాత్ర పోషించవలసిన అవస రం ఎంతైనా ఉంది. అప్పుడప్పుడు కేవలం ఒక వ్యక్తి నిర్ల క్ష్యం కర్మాగారంలో ఎన్నో అనర్థాలకు, అశాంతికి దారితీ స్తుందన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. కాంట్రాక్టు కార్మికులు సురక్షితంగా పనిచేయుటకు అనువైన పరిస్థి తుల్ని కల్పించడం సదరు గుత్తేదారులు తమ గురుతర బాధ్యతగా భావించి మసలుకోవాలి. ప్రమాదాలు జరగ కుండా సంస్థని సంపూర్ణ ప్రమాద రహితంగా, భద్రత సైతంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించా లి. ప్రతి దినం పని ప్రదేశంలో భద్రత దినంగా ప్రపం చం మొత్తం ఆరోగ్యంగా వర్థిల్లాలని కోరుకుందాం. అప్పు డే కాలుష్య రహిత ప్రదేశంగా మానవ సహితంగా దేశం గా, అభివద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం ఉం టుందని ప్రపంచ భద్రత్ర ఆరోగ్య దినోత్సవం సందర్భం గా ఆశిద్దాం అని ఆయన అన్నారు

Spread the love